కేసీఆర్ తరుపు బీహార్ మంత్రి ట్విట్టర్‌లో.. తనపై దాడి చేస్తున్నారన్న టీపీసీసీ రేవంత్

TPCC President Revanth Reddy Comments on Dharani Portal | TS News Today
x

కేసీఆర్ తరుపు బీహార్ మంత్రి ట్విట్టర్‌లో.. తనపై దాడి చేస్తున్నారన్న టీపీసీసీ రేవంత్

Highlights

Revanth Reddy: ధరణి పోర్టల్‌ వల్లె రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని ఆరోపణ

Revanth Reddy: రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే కేసీఆర్ తరుపున బీహార్ మంత్రి మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సోమేశ్ కుమార్ కలిసి ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌తో రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ధరణి వల్ల పదుల సంఖ్యలో హత్యలు జరుగుతున్నాయన్నారు. నిన్న ఇబ్రహీంపట్నంలో జరిగిన రియల్టర్ హత్యలు ఇలాంటివేనని అభిప్రాయపడ్డారు. ధరణి పోర్టల్‌లో వివరాలు తప్పుడుగా నమోదు కావడం వల్లె ఈ ఘోరం జరిగిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories