రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

*గాంధీభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మీటింగ్

Jyothi
Published on: 21 May 2023 9:37 AM IST
TPCC Meeting at Gandhi Bhavan
X

రేపు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

TPCC Meeting: గాంధీభవన్‌ ప్రకాశం హాలులో రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఏఐసీసీ ఇంచార్జి మానిక్‌రావ్ ఠాక్రే పాల్గొననున్నారు. ఈ సమావేశానికి పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు.. అనుబంధ సంఘాల చైర్మన్లు, పీసీసీ సభ్యులు హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story