నేడు టీపీసీసీ భారీ ర్యాలీ

TPCC: *ర్యాలీకి అనుమతి ఇచ్చిన పోలీసులు

Sriveni Erugu
Published on: 13 Jun 2022 9:08 AM IST
TPCC huge rally today
X

నేడు టీపీసీసీ భారీ ర్యాలీ

TPCC: నేడు టీపీసీసీ తలపెట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇచ్చారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఏఐసీసీ నిరసనలకు పిలుపునిచ్చింది. నేడు నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహ‌ం నుండి.. బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ ఈడీ ఆఫీస్‌లో ఉన్నంత సేపు.. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు దీక్ష చేయనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story