టీపీసీసీ కొత్త సారధి ఎంపిక ప్రక్రియ వేగవంతం

Arun Chilukuri
Published on: 11 Dec 2020 12:21 PM IST
టీపీసీసీ కొత్త సారధి ఎంపిక ప్రక్రియ వేగవంతం
X

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధికి సంబంధించి ప్రక్రియ వేగవంతం అయింది. పదవి కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఏఐసీసీ ఇంఛార్జ్‌ మాణికం ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఇవాళ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్ల అభిప్రాయాలను సేకరించనున్నారు.

ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పార్టీ సీనియర్‌ నేతలతో మాణికం ఠాగూర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కీలకమని సీనియర్లు చెప్పినట్లు సమాచారం. వరంగల్ ఎన్నికల బాధ్యతను కొండా సురేఖకు అప్పగించాలని కొండా ఫ్యామిలీని పిలిచి మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story