TPCC Chief: ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్‌ ప్రకటన

TPCC Chief: ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్‌‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Arun Chilukuri
Published on: 18 Jun 2021 4:25 PM IST
TPCC Chief Would be Announced at Any Time
X

సోనియా గాంధీ(ఫైల్ ఇమేజ్ )

TPCC Chief: ఏ క్షణమైనా టీపీసీసీ చీఫ్‌‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టీపీసీసీ చీఫ్‌‌పై సోనియా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. సోనియాతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‍ఛార్జ్‌ మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు. కొత్త టీపీసీసీ చీఫ్‌‌పై తుది చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌పై ఈరోజు అంతిమ నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. దాంతో, ఏ క్షణమైనా కొత్త పీసీసీ ఛీప్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పీసీసీ చీఫ్ కోసం పోటా పోటీ లాబీయింగ్ నడుస్తోంది. పీసీసీ చీఫ్ దాదాపు ఖరారు చేశారని..అనే హామీతో ఓ నేత ఫ్యామిలీతో ఢిల్లీకి పయనమయ్యారని సమాచారం. మొత్తంగా ఈరోజు రాత్రి వరకు పీసీసీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story