Revanth Reddy: నేడు నిర్మల్‌లో టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి పర్యటన

Revanth Reddy: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టాక తొలిసారి పర్యటన * పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసనలు

Sandeep Eggoju
Updated on: 12 July 2021 10:45 AM IST
TPCC Chief Revanth Reddy Tour in Nirmal District Today
X

నిర్మల్ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు టీ.కాంగ్రెస్‌ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నారు. ఆయా ప్రాంతాల్లో సైకిల్‌, ఎడ్లబండ్ల ర్యాలీలు నిర్వహించనున్నారు.

టీ.పీసీసీ పదవి చేపట్టాక రేవంత్‌ రెడ్డి మరింత స్పీడ్‌ పెంచారు. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ హోదాలో నిర్మల్‌లో ఆయన మొదటి పర్యటన కొనసాగనుంది. జిల్లా కేంద్రంలో సైకిల్‌, ఎడ్లబండ్ల ర్యాలీల్లో పాల్గొని సభలో ప్రసంగించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇక నిర్మల్‌ జిల్లాతో ప్రారంభించి అన్ని జిల్లాల్లో పర్యటనలు చేయాలని భావిస్తున్నారు రేవంత్ రెడ్డి. నిరసనలు, సభలు, సమావేశాలు.., ఇలా ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొని జిల్లాల్లో పార్టీ నాయకులను సెట్‌ రైట్‌ చేయనున్నారు. వరుస జిల్లాల పర్యటనలు చేపట్టి.. పార్టీని ఊరూరా, వాడవాడకూ తీసుకెళ్లాలని చూస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story