Revanth Reddy: చిట్‌చాట్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy: హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో తిరుగుబాటు -రేవంత్‌

Sandeep Eggoju
Updated on: 18 Oct 2021 9:57 PM IST
TPCC Chief Revanth Reddy Sensational Comments in Chitchat
X
రేవంత్ రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Revanth Reddy: టీ.పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లోని కొందరు నేతలు తిరుగుబావుటా ఎగురవేస్తారని అని అన్నారు. అంతర్గత తిరుగుబాటు తట్టుకోవడానికే ప్లీనరీ, వరంగల్‌లో ప్రజాగర్జన సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా మంత్రి హరీష్‌రావును మిత్రదోహిగా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్‌ రెడ్డి. ఎవ్వరూ పార్టీ వీడ కూడదని కేసీఆర్‌ ముందస్తు హెచ్చరికలు జారీ చేశాడన్న రేవంత్‌ హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌ ఓడినా, గెలిచినా ఆపార్టీలోని కొందరు నేతల తిరుగుబాటు తప్పదని మరోసారి తేల్చిచెప్పారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story