సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. రెండు అంశాలపై ప్రశ్నలు...

Revanth Reddy: భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు - రేవంత్‌

Shireesha
Published on: 22 May 2022 12:20 PM IST
TPCC Chief Revanth Reddy Open Letter to CM KCR | Live News Today
X

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ.. రెండు అంశాలపై ప్రశ్నలు...

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు TPCC ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రెండు అంశాలను ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఎనిమిదేళ్లవుతున్నా జయశంకర్ సార్ స్వగ్రామంలో అభివృద్ధి మచ్చుకైనా కానరావడం లేదని రేవంత్ అన్నారు. ఈ ఊరిలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.

అదేవిధంగా వరంగల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భూములు కోత్పోతున్న రైతుల వ్యధలు పట్టడంలేదా అని రేవంత్ ప్రశ్నించారు. రింగు రోడ్డు కోసం కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. ల్యాండ్ పూలింగ్ విధానంలో పెద్ద ఎత్తున భూ సేకరణకు సిద్ధమైందని, ORR ప్రాజెక్టుకు పచ్చని పొలాల్లో చిచ్చు పెడుతోందన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వెనక్కి తీసుకునే దాకా పోరాటం సాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Shireesha

Shireesha

Next Story