Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 12 Aug 2021 3:51 PM IST
TPCC Chief Revanth Reddy Open Letter To CM KCR
X

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ బహిరంగ లేఖ రాశారు. ఖమ్మం జైల్లో గిరిజన మహిళలపై జరిగిన అమానుష ఘటనపై చర్యల గురించి లేఖ రాసిన రేవంత్ ఈ ఘటనకు కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17లోగా రాష్ట్రంలోని పోడు భూములు అన్నింటికీ పట్టాలివ్వాలని లేఖలో పేర్కొన్నారు.

అలాగే, తెలంగాణలోని ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ గిరిజన, ఆదివాసీ జీవితాల్లో వెలుగులు నింపిన ఐటీడీఏలు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శిధిలావస్థకు చేరుకున్నాయని ఆరోపించారు. తక్షణమే వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలన్న రేవంత్ లేనిపక్షంలో దళిత-గిరిజన దండోరాలతో ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరును మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story