Revanth Reddy: గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలు బయటకు వచ్చాయి

Revanth Reddy: గవర్నర్‌తో సఖ్యత లేనప్పుడు కేటీఆర్‌ను సీఎంను చేయడం కుదరదని.. గవర్నర్‌ను ఒప్పించే పనిలో ఉన్నారు

Rama Rao
Published on: 8 April 2022 4:11 PM IST
TPCC Chief Revanth Reddy Made Sensational Remarks | Telangana News
X

Revanth Reddy: గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలు బయటకు వచ్చాయి

Revanth Reddy: గవర్నర్ ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలు చర్చకు వచ్చాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. తనను సీఎం చేయాలని కేటీఆర్‌ కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని గవర్నర్‌తో సఖ్యత లేనపుడు కేటీఆర్‌ను సీఎం చేయడం కష్టమని కేసీఆర్‌ కుటుంబసభ్యులతో చెప్తున్నారన్నారు రేవంత్. గవర్నర్‌ను సాకుగా చూపి.. కేసీఆర్‌ కుటుంబ సమస్య నుంచి తప్పించుకుంటున్నారన్నారు. ఇక సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారంటే రాష్ట్రంలో వైద్యరంగం పడకేసినట్లే విమర్శించారు. సెక్షన్‌ 8 పరిధిలో సర్వాధికారాలను గవర్నర్‌కు రాజ్యాంగం కట్టబెట్టిందన్న ఆయన విద్య, వైద్యం, శాంతి భద్రతలపై సమీక్ష చేసి చర్యలు చేపట్టే అధికారం ఉందన్నారు. గవర్నర్ తక్షణమే తన అధికారాలను ఉపయోగించుకోవాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story