Revanth Reddy: రేపటి నుంచి జిల్లాల్లో పర్యటిస్తాం

* కేసీఆర్‌కు కలెక్టర్లు కట్టు బానిసలుగా మారారు -రేవంత్‌ * రైతు మరణాన్ని సహజ మరణం అనడం సిగ్గుచేటు -రేవంత్

Shilpa
Updated on: 6 Nov 2021 8:00 PM IST
TPCC Chief Revanth Reddy Fires on District Collectors in Telangana
X

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: సీఎం కేసీఆర్‌ ఏం చెబితే అది చేసేవారిని కలెక్టర్లుగా పిలిచేందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేసీఆర్ ఫాంహౌస్‌లో కట్టు బానిసలుగా కలెక్టర్లు మారి, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

వరిని కొనుగోలు చేయకపోవడంతో గుండె పగిలి చనిపోయిన రైతు మరణాన్ని ప్రభుత్వం సహజ మరణం అనడం సిగ్గుచేటన్నారు రేవంత్‌రెడ్డి. రైతు సమస్యలు, వరి కొనుగోళ్లు అంశంపై రేపట్నుంచి జిల్లాల పర్యటన చేపడుతున్నట్టు రేవంత్‌ స్పష్టం చేశారు.

Shilpa

Shilpa

Next Story