సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్

Revanth Reddy: వరి వేస్తే ఉరేనంటూ రైతులను కేసీఆర్ మోసం చేశాడు

Jyothi
Published on: 21 March 2022 7:53 AM IST
TPCC Chief Revanth Reddy Fires On CM KCR
X

సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్

Revanth Reddy: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఊరు-మన పోరు బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వం చివరి ధాన్యపు గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఏప్రిల్ నెల నుంచే సీఎం కేసీఆర్ ధాన్యం కొనేందుకు ఏర్పాట్లు చేయకుంటే రైతులతో కలిసి ఫాంహౌస్‌ను ముట్టడిస్తామని రేవంత్ హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీకి రెండు సార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపం ఢిల్లీ వెళ్లి పోరాడతానని కేసీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని మండిపడ్డారు.

Jyothi

Jyothi

Next Story