Revanth Reddy: బండి సంజయ్, కిషన్‎రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్ర నుంచి రూ.2వేల కోట్లు తీసుకురావాలి

Revanth Reddy: బీజేపీ ప్రభుత్వంపై రేవంత్‎రెడ్డి ఫైర్

Rama Rao
Updated on: 16 July 2022 5:58 PM IST
TPCC Chief Revanth Reddy Fire on BJP
X

Revanth Reddy: బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‎రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. కేంద్ర నుంచి రూ.2వేల కోట్లు తీసుకురావాలి

Revanth Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీపీపీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలోని వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలన్నారు. వెంటనే విపత్తు నిధి నుంచి 2వేల కోట్లు విడుదల చేయాలన్నారు. ఆ పార్టీ నేతలకు రాష్ర్టంలో అధికారంలోకి రావాలన్న ధ్యాస తప్పితే ప్రజా సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నిజంగా తెలంగాణ ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆపార్టీ చీఫ్ సంజయ్ కేంద్రం నుంచి వరద సహాయక నిధులు తీసుకురావాలన్నారు. అప్పుడే ఈప్రాంత ప్రజలు నమ్ముతారన్నారు.

Rama Rao

Rama Rao

Next Story