Revanth Reddy: రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందా..? అందుకే బీఆర్ఎస్ గా మార్చారా..?

Revanth Reddy: కేసీఆర్ మాటలను అంత సీనియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు

Rama Rao
Updated on: 11 Jun 2022 5:01 PM IST
TPCC Chief Revanth Reddy Comments On KCR | TS News
X

Revanth Reddy: రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందా..? అందుకే బీఆర్ఎస్ గా మార్చారా..?

Revanth Reddy: రాష్ట్రంలో టీఆర్ఎస్ పనైపోయిందని అందుకే కేసీఆర్ దేశరాజకీయాలంటూ కొత్త రాగం అందకున్నారన్నారు టీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ పేరు ఖరారు చేశారన్న వార్తలపై రేవంత్ సెటైర్లు వేశారు. కేసీఆర్ టీఆరెస్ ని బిఅరెస్ చేస్తే మున్ముందు ప్రజలు దానిని విఅరెస్ చేస్తారని అన్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళితే కేసీఆర్ కు భంగపాటు తప్పదన్న ఆయన గజ్వేల్ ఫార్మ్ హౌజే ఆయనకు ఇల్లు, రాష్ట్రం, నియోజకవర్గం కానుందన్నారు. టీఆరెస్ పెరు మీద ఏ రాష్ట్రంలో అయిన పోటీ చేయవచ్చన్న ఆయన బిఅరెస్ గా మారిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలన్నారు. కేసీఆర్ మాటలను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story