రాజగోపాల్ రెడ్డి తిరిగొస్తే టికెట్ ఇస్తా..!

*కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు

Jyothi
Published on: 21 Aug 2022 8:05 AM IST
TPCC Chief Revanth Reddy Announced a Bumper offer to Komati Reddy Rajagopal Reddy
X

రాజగోపాల్ రెడ్డి తిరిగొస్తే టికెట్ ఇస్తా..! 

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. పార్టీకి రాజీనామా చేసిన రాజ‌గోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌స్తే ఆయ‌న‌కే మునుగోడు టికెట్ ఇస్తామ‌ని రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కాంగ్రెస్ త‌ర‌ఫున రాజ‌గోపాల్ రెడ్డికి బీ ఫామ్ ఇవ్వ‌డంతో పాటుగా సీనియ‌ర్ నేత‌లంతా క‌లిసి ఆయ‌న‌ను మునుగోడు ఉప ఎన్నిక‌లో గెలిపించుకుంటామ‌ని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు.

Jyothi

Jyothi

Next Story