కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.

Arun Chilukuri
Published on: 31 Oct 2025 2:59 PM IST
కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్
X

కిషన్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ సవాల్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌పై ఎలాంటి కేసులు ఉన్నాయి..? అవి ఏమయ్యాయో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భారత కెప్టెన్‌గా అజారుద్దీన్ ఎన్నో విజయాలు అందించిన విషయం కిషన్ రెడ్డి మరిచిపోయారా..? అని మండిపడ్డారు. ఎంపీగా కూడా అజారుద్దీన్ ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. అజారుద్దీన్ మంత్రి పదవిపై బీజేపీ నేతలు ఎందుకు అక్కసు వెళ్లగక్కుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story