Gandhi Bhavan: గాంధీభవన్‌లో ఉ.11 గం.కు టీపీసీసీ ఛార్జ్‌షీట్ కమిటీ సమావేశం

Gandhi Bhavan: కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్న ముఖ్య నేతలు

Shekhar G
Published on: 14 Sept 2023 9:27 AM IST
TPCC Charge Sheet Committee Meeting At Gandhi Bhavan At 11 AM
X

Gandhi Bhavan: గాంధీభవన్‌లో ఉ.11 గం.కు టీపీసీసీ ఛార్జ్‌షీట్ కమిటీ సమావేశం

Gandhi Bhavan: ఎన్నికల ప్రక్రియను తెలంగాణ కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టింది. ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో టీపీసీసీ ఛార్జ్‌షీట్ కమిటీ సమావేశం కానుంది. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అధ్యక్షతన కమిటీ సభ్యులు భేటీకానున్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న బహిరంగ సభలో సోనియాగాంధీ చేత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ రిలీజ్ చేయనున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను డోర్ టు డోర్ తీసుకెళ్లడానికి కార్యాచరణను ఛార్జ్‌షీట్ కమిటీ సిద్ధం చేయనుంది. మరో వైపు మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ కమ్యూనికేషన్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఛైర్మన్ కుసుమకుమార్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఎన్నికల సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు. కార్యక్రమాల్లో కమ్యూనికేషన్ చేసుకోవడంపై కమిటీ సభ్యులకు ముఖ్యనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story