Congress: నేడు టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ

Congress: సా.5 గంటలకు ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ

Shashank Gullapelli
Published on: 29 March 2024 9:08 AM IST
TPCC Campaign Committee Meeting Today
X

Congress: నేడు టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ 

Congress: ఆపరేషన్ ఆకర్ష్‌తో జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్..అదే ఫామ్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీటల్లో గెలుపే లక్ష్యంగా.. వ్యూహాలు రచిస్తోంది.. ఈ నేపథ్యంలోనే... ఇవాళ టీపీసీసీ ప్రచార కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు కమిటీ చైర్మన్ మధుయాష్కీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి హాజరుకానున్నారు. ఇక..సాయంత్రం 5 గంటలకు ప్రదేశ్‌ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ కానుంది. సీఎం రేవంత్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో మున్షీ, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, పీఈసీ సభ్యులు పాల్గొననున్నారు. ప్రధానంగా..లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం, మేనిఫెస్టో, పోల్ మేనేజ్‌మెంట్ పై చర్చించే అవకాశముంది.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story