Drugs Case: డ్రగ్స్ కేసులో నాలుగో రోజు టోనీ విచారణ

Drugs Case: తొమ్మిది మందిని వారం రోజుల కస్టడీ కోరిన పోలీసులు

Rama Rao
Published on: 1 Feb 2022 9:04 AM IST
Tony Trial on Fourth day in Drugs case in Hyderabad | TS News Today
X

 డ్రగ్స్ కేసులో నాలుగో రోజు టోనీ విచారణ

Drugs Case: డ్రగ్స్ కేసులో నాలుగో రోజు టోనీని విచారించనున్నారు పోలీసులు. మూడో రోజు విచారణలో పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక టోనీ ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ ఖాతాల స్టేట్‌మెంట్స్ వివరాలను ముందుంచి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఫోన్ కాల్ లిస్ట్‌లో ఉన్న నెంబర్స్ ఎవరివి..? ఆ వ్యక్తులు ఎవరన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న ఆరుగురు టోనీ అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నలుగురు వ్యాపారుల్లో గజేంద్ర పరిక్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.

డ్రగ్స్ కేసులో తొమ్మిది మంది నిందితుల కస్టడీపై నేడు తీర్పు వెలువరించనుంది హైకోర్టు. డ్రగ్ పెడ్లర్ టోనీతో సహా తొమ్మిది మంది వ్యాపారులు అరెస్ట్ అయ్యారు. తొమ్మిది మందిని వారం రోజుల పాటు కస్టడీకి కోరారు పోలీసులు. అయితే గతంలో కస్టడీని నాంపల్లి కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.

Rama Rao

Rama Rao

Next Story