దడ పుట్టిస్తున్న టమాటా ధరలు

Tomato Price Hike: కరోనా దెబ్బకు వ్యాపారాలు, కంపెనీలు అన్ని ఎక్కడికక్కడ స్థంబించిపోవడంతో చాలా...
Tomato Price Hike: కరోనా దెబ్బకు వ్యాపారాలు, కంపెనీలు అన్ని ఎక్కడికక్కడ స్థంబించిపోవడంతో చాలా కుటుంబాలు సగం వేతనంతోనే జీవనం సాగిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు మరింత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు అందరికి అందుబాటులో ఉండే టమాట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటింది. ఇప్పుడు టమాట కొనాలన్నా, తినాలన్నా ఒక్కసారి ఆలోచించుకోవలసిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం పెరిగిన ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.
మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉంది. దీంతో సామాన్యులు షాక్‌కు గురవుతున్నారు. కేవలం టమాటా ధర మాత్రమే కాదు. అన్ని రకాల కూరగాయల ధరలు పెరిగాయి. నిజానికి టమాటా ధరలు ఇంతగా పెరగడానికి కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు చాలా జిల్లాల్లో టమాటా పంట కొట్టుకు పోయింది. మరికొన్నిచోట్ల పూర్తిగా కాయకముందే వర్షాల వల్ల టమాటా కోయాల్సి వచ్చిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా టమాటా పండించే రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో టమాటా పంటలు తగ్గిపోయాయి.