Amani: బీజేపీలో చేరిన ప్రముఖ నటి ఆమని

Amani: టాలీవుడ్ సీనియర్ నటి ఆమని రాజకీయ అరంగేట్రం చేశారు.

Arun Chilukuri
Published on: 20 Dec 2025 2:00 PM IST
Amani: బీజేపీలో చేరిన ప్రముఖ నటి ఆమని
X

Amani: టాలీవుడ్ సీనియర్ నటి ఆమని రాజకీయ అరంగేట్రం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆమె అధికారికంగా భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. రాంచందర్‌రావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు ఈ సందర్భంగా ఆమని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story