నేడు పాతబస్తీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి సీఎం యోగి

Jyothi
Published on: 2 July 2022 9:03 AM IST
Today, Yogi Adityanath is the UP CM For Old Basti
X

నేడు పాతబస్తీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా యోగికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికేందుకు రాష్ట్ర పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని యోగి ఆదిత్యనాథ్ సందర్శించనున్నారు.

యోగి పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో సెక్యురిటీని పెంచారు. ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. యోగితో పాటు మరికొందరు ముఖ్య నేతలు పాతబస్తీలో ఉన్న అమ్మవారి ఆశీస్సులు తీసుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story