Telangana: నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం

Telangana: ఇవాళ సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.

Arun Chilukuri
Published on: 10 Jun 2021 10:33 AM IST
Today Key Meeting of Telangana BJP Leaders
X

Telangana: నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కీలక సమావేశం

Telangana: ఇవాళ సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌కు ఢిల్లీ నుంచి ఆర్గనైజింగ్ సహా కార్యదర్శి ప్రకాశ్ జీ హాజరుకానున్నారు. ప్రకాష్ జీ ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన్ను తెలుగు రాష్ట్రాల ఇంచార్జ్‌గా నియమించారు. దాంతో మొదటిసారి తెలంగాణ నేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే పార్టీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ హైదరాబాద్‌ చేరుకున్నారు. పార్టీ పనితీరును పరిశీలించనున్నారు. పార్టీ కోర్ కమిటీ ముఖ్య నేతలతో ప్రకాశ్ సమావేశం కానున్నారు. అయితే ఈటల పార్టీలో చేరిక, పార్టీ వ్యూహం పై రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం తీసుకోనున్నారు.

ఈ సమావేశానికి తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మధ్యప్రదేశ్ ఇంచార్జ్ మురళీధర్ రావు, బీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌తో ప్రకాష్ జీ భేటీ కానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story