ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు

Telangana: ఉ.11.30 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

Jyothi
Published on: 15 Dec 2023 8:54 AM IST
Today is the Third day of Telangana Assembly Meetings
X

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు

Telangana: ఇవాళ తెలంగాణ అసెంబ్లీ మూడోరోజు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు సభ ప్రారంభం కానుండగా.. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్ స్పీచ్ ఉండనుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి గవర్నర్ ప్రసంగం జరగనుండగా.. నిన్న గవర్నర్ ప్రసంగంపై చర్చించి ఆమోదం తెలిపింది కేబినెట్. దీంతో గవర్నర్ ప్రసంగంలో కొత్త ప్రభుత్వం ఎలాంటి అంశాలను చేర్చిందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహించి సమావేశాలను ఎన్నిరోజులు నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story