Liquor Lucky Draw: అదృష్టవంతులెవరో.. తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా

Liquor Lucky Draw: డిసెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్న విక్రయాలు

Shekhar G
Published on: 21 Aug 2023 11:57 AM IST
Today Is The Lucky Draw For Liquor Stores In Telangana
X

Liquor Lucky Draw: అదృష్టవంతులెవరో.. తెలంగాణలో మద్యం దుకాణాలకు నేడు లక్కీ డ్రా

Liquor Lucky Draw: తెలంగాణలో మద్యం దుకాణాల లక్కీ డ్రాను అబ్కారీ శాఖ ఇవాళ నిర్వహించనుంది. రాష్ట్రలోని 34 అబ్కారీ జిల్లాలల్లో ఈ లక్కీ డ్రా కార్యక్రమం ఆయా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో అబ్కారీ శాఖ నిర్వహిస్తుంది. మొత్తం 2వేల 620 మద్యం దుకాణాలల్లో 786 దుకాణాలు గౌడ్లు, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించగా మిగిలిన 18వందలా 34 దుకాణాలను ఇతరులకు కేటాయిస్తారు. ప్రతి దుకాణానికి ప్రత్యేకంగా లక్కీ డ్రా తీయాల్సి ఉండడంతో.. అబ్కారీ శాఖ ఫంక్షన్‌ హాలుల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. అక్కడ లక్కీ డ్రాలో పాల్గొనేందుకు వచ్చిన దరఖాస్తుదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌, డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖ్‌ అధికారులను ఆదేశించారు.

శంషాబాద్‌లో 100 మద్యం దుకాణాలకు 10వేల 621 దరఖాస్తులు రావడంతో ఇక్కడ ఒక్కో మద్యం దుకాణానికి 106కు పైగా దరఖాస్తులు వచ్చాయి. సరూర్‌ నగర్‌లో 134 దుకాణాలకు 10వేల 994 దరఖాస్తులు వచ్చి ఒక్కో దుకాణానికి 82 దరఖాస్తులు వచ్చినట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడ లక్కీ డ్రాకు ప్రత్యేక అధికారులను అబ్కారీ శాఖ నియమించింది.

Shekhar G

Shekhar G

Next Story