Shilpa Chowdary: శిల్పా చౌదరి పోలీస్ కస్టడీకి ఇవాళే చివరి రోజు

* రెండ్రోజులుగా విచారణకు సహకరించని శిల్పా చౌదరి * కోట్ల రూపాయలు ఎగవేసినట్లు శిల్పాపై కంప్లైంట్స్‌

Sandeep Reddy
Updated on: 12 Dec 2021 2:31 PM IST
Today is Last day for Shilpa Chowdary Police Investigation
X

శిల్పా చౌదరి పోలీస్ కస్టడీకి ఇవాళే చివరి రోజు

Shilpa Chowdary: ఇవాళ శిల్పా చౌదరి పోలీస్‌ కస్టడీ ముగియనుంది. కాగా రెండ్రోజులుగా శిల్పా చౌదరి విచారణకు సహకరించనట్లుగా సమాచారం. కోట్ల రూపాయలు ఎగవేసినట్లు శిల్పాపై కంప్లైంట్స్‌ రావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతేకాదు డబ్బు తిరిగి ఇవ్వకుండా బౌన్సర్లతో దాడి చేయిస్తోందని శిల్పాపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇందులో మధ్యవర్తులుగా ఉన్నా మల్లారెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, దివ్యారెడ్డిలను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇక బినామీల ద్వారా శిల్పా కొంత డబ్బును అమెరికాకు తరలించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story