ఇవాళ టీకాంగ్రెస్‌ నేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ

Digvijaya Singh: రేవంత్‌ వర్గం, సీనియర్ల వర్గంతో విడివిడిగా భేటీ

Jyothi
Updated on: 22 Dec 2022 9:31 AM IST
Today Digvijaya Singh will Meet the T Congress leaders
X

ఇవాళ టీకాంగ్రెస్‌ నేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ

Digvijaya Singh: తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఏకతాటిపైకి తెచ్చే పనిలో హైకమాండ్‌ ఉంది. ఇవాళ టీకాంగ్రెస్‌ నేతలతో దిగ్విజయ్‌ సింగ్‌ భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌కు డిగ్గీరాజా చేరుకోనున్నారు. రేవంత్‌ వర్గం, సీనియర్ల వర్గంతో ఆయన విడివిడిగా భేటీకానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు దిగ్విజయ్‌ సింగ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ వర్గం, సీనియర్ల వర్గం పంచాయితీ మరింత ముదిరింది. కొత్త కమిటీలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికే అధిక ప్రాధాన్యం ఇచ్చారంటూ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నేతలను గాడిన పెట్టేందుకు హైదరాబాద్‌ చేరుకున్నారు ఏఐసీసీ కీలక నేత దిగ్విజయ్‌ సింగ్. ఇప్పటికే రేవంత్‌ వర్గంలోని 13 మంది కాంగ్రెస్‌ నేతలు రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు తమ రాజీనామా లేఖలను అందజేశారు. అయితే ఇవాళ డిగ్గీరాజాతో రెండు వర్గాలు సమావేశం అవుతుండటంతో సమస్యలు కొలిక్కి వస్తాయా..? లేదా..? అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

Jyothi

Jyothi

Next Story