Revanth Reddy: నేడు, రేపు ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించాలి.. లేకుంటే శుక్రవారం నాడు జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముట్టడిస్తాం

Revanth Reddy: ట్రాఫిక్ సమస్యతో ప్రజలు యాతన పడుతున్నారు

Shekhar G
Published on: 26 July 2023 12:14 PM IST
Today And Tomorrow Govt Should Provide Proper Service To People Says Revanth Reddy
X

Revanth Reddy: నేడు, రేపు ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించాలి.. లేకుంటే శుక్రవారం నాడు జీహెచ్‌ఎంసీ ఆఫీస్ ముట్టడిస్తాం

Revanth Reddy: హైదరాబాద్‌లో వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలమవుతుంటే వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని, పుట్టిన రోజు మోజులో ఉన్న కేటీఆర్... ప్రజలను మరచిపోయారని విమర్శించారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదన్నారు.. వారం రోజులుగా భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా యాతన పడుతున్నారని, రోడ్లపైనే గంటలకొద్దీ ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు.

హైదరాబాద్ విశ్వనగరంగా అభివర్ణించారని, హైదరాబాద్‌ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్‌గా మారుస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్, కేటీఆర్... హైదరాబాద్‌ను నరక కూపంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నాలాలు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని రేవంత్ సూచించారు. పాత భవనాలు, గోడలు, పాడు బడిన ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను బయటకు పంపొద్దన్నారాయన..

తొమ్మిదేళ్లుగా హైదరాబాద్‌లో సౌకర్యాల కల్పన కోసం కేసీఆర్... కేటీఆర్... ప్రజలకు మేలు జరిగే ఒక్క చర్య చేపట్టలేదన్నారు రేవంత్... కాంగ్రెస్ శ్రేణులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సహాయ... సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు.. నేడు, రేపు ప్రభుత్వం ప్రజలకు సరైన సేవలు అందించాలని, లేకుంటే శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్ హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story