Tita offers to software Sharada : శారదకు 'టిటా' అద్భుత అవకాశం

Tita offers to software Sharada : లాక్ డౌన్ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు.
Tita offers to software Sharada : లాక్ డౌన్ సమయంలో చాలా మంది తమ ఉపాధి కోల్పోయారు. అందులో భాగంగా వరంగల్ కి చెందిన శారద అనే ఓ అమ్మాయి హైదరాబాదులో తానూ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని కోల్పోయింది. అయినప్పటికీ తానూ మాత్రం దైర్యాన్ని కోల్పోలేదు. కుటుంబ పోషణకి గాను మార్కెట్‌లో ఉండి కూరగాయల వ్యాపారం చేస్తోంది. దీనిపైన ఇప్పటికే మీడియా అనేక రకాల కథనాలని వెల్లడించింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది పలువురు రాజకీయ నాయకులు ఆమెను పలకరించారు.
కానీ ఇప్పుడు ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ శారదకు అండగా నిలుస్తుంది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయి నిరుద్యోగురాలైన శారదకు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా) అండగా నిలిచేందుకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే శనివారం శారదకు టిటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ఉచితంగా ల్యాప్‌టాప్‌ను అందచేశారు. కృత్రిమ మేథస్సు (ఏఐ) టెక్నాలజీపై శారదకు ఉచితంగా శిక్షణ ఇస్తామని, ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. టిటా గత కొద్ది రోజుల క్రితం యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉచిత శిక్షణ పొందేందుకు అవసరమైన పత్రాలను శారదకు అందించారు.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
హైదారబాద్లో తల్వార్, కత్తులతో యువకుల హంగామా
26 Jun 2022 7:43 AM GMTMekapati Vikram Reddy: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం
26 Jun 2022 7:19 AM GMTఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMTLIC Policy: ఎల్ఐసీ సూపర్ టర్మ్ ప్లాన్.. 50 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 6:30 AM GMT