కాసేపట్లో ఉప్పల్‌లో భారత్, ఆసిస్‌ ఫైనల్ టీ 20 మ్యాచ్

Tight security for today’s cricket match in Hyderabad
x

కాసేపట్లో ఉప్పల్‌లో భారత్, ఆసిస్‌ ఫైనల్ టీ 20 మ్యాచ్ 

Highlights

*2500 పోలీసులు, 300 సీసీ కెమెరాలతో నిఘా

Hyderabad: భారత్, వర్సెస్ ఆసిస్ మ్యాచ్‌. సిరీస్‌ను నిర్ణయించే లాస్ట్ టీ 20 మ్యాచ్. విన్నర్ ఎవరు..? ఎవరిది సిరీస్..? ఇలా క్షణక్షణానికి టెన్షన్ పెరుగుతూ వస్తోంది. కాసేపట్లో ఉప్పల్‌లో జరగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇప్పటికే పార్క్ హయత్ హోటల్ ఉన్న రెండు జట్ల ప్లేయర్స్ స్టేడియంకు బయల్దేరి వెళ్లనున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరగనుండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఇటు ఉప్పల్ స్టేడియానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో క్రికెట్ లవర్స్ చేరుకున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. స్టేడియం పరిసరాల్లో ఆంక్షలు విధించారు. ఇటు మ్యాచ్‌ కోసం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. 2500 మంది పోలీసులతో సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అలాగే 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు మ్యాచ్‌ దృష్ట్యా మెట్రో సర్వీసులు పెంచారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories