Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పులిచర్మం కలకలం

Adilabad: కాగజ్‌నగర్ ఫారెస్ట్ ప్రాంతంలో రెండు పులులు హతం

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 5:46 PM IST
Tiger Skin Found in Adilabad District Kagaznagar
X
కాగజ్ నగర్ లో పులి చర్మం కలకలం (ఫైల్ ఇమేజ్)

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పులి చర్మం కలకలం రేపింది. కాగజ్‌నగర్ ఫారెస్ట్ ప్రాంతంలో రెండు పులులు హతమైనట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. వీటిలో ఒక పులిచర్మం స్వాధీనం చేసుకోగా మరో దాని కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి 10మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు పులి చర్మం కేసులో అమాయకులను అరెస్ట్ చేశారంటూ ఇంద్రవెల్లిలో తుడుందెబ్బ నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తకరంగా మారిపోయాయి. పోలీసులు, ఉడుందెబ్బ నాయకుల మధ్య జరిగిన తోపులాట జరగడంతో ఆదిలాబాద్-మంచిర్యాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story