Kamareddy: దోమకొండలో పెద్దపులి సంచారం

Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండలో పెద్దపులి సంచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. అంబారీపేట్‌ గ్రామ శివారులో పశువులపై దాడి చేసింది పెద్దపులి.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 11:49 AM IST
Kamareddy: దోమకొండలో పెద్దపులి సంచారం
X

Kamareddy: కామారెడ్డి జిల్లా దోమకొండలో పెద్దపులి సంచారం.. తీవ్ర కలకలం రేపుతోంది. అంబారీపేట్‌ గ్రామ శివారులో పశువులపై దాడి చేసింది పెద్దపులి. వరుసగా రెండ్రోజుల నుంచి ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్దపులి దాడిలో రెండు గేదెలు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పెద్దపులి ఆనవాళ్లు గుర్తించారు. అంబారీపేట్‌, లక్ష్మీదేవ్‌పల్లి, గొట్టిముక్కల గ్రామశివారుల్లో పెద్దపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు.

పెద్దపులి ఆచూకీ కోసం ట్రాక్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే.. పెద్దపులి ఆనవాళ్లు కనిపించకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎటునుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. తక్షణమే పెద్దపులి సంచరిస్తున్న గ్రామాల్లో బోన్లు ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story