Jayashankar Bhupalapally: పెద్ద పులి సంచారంతో భయాందోళనలో జిల్లా వాసులు

Jayashankar Bhupalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి గత వారం రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేస్తుంది

Shilpa
Updated on: 6 Dec 2021 11:37 AM IST
Tiger on Prowl in Jayashankar Bhupalpally District
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం(ఫైల్ ఫోటో)

Jayashankar Bhupalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి గత వారం రోజులుగా కంటిమీద కునుకులేకుండా చేస్తుంది.మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు రాష్ట్రల నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లోకి ప్రవేశించిన పెద్దపులి మహాముత్తారం, మల్హార్ మండలాల్లోని అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం.

అటవీశాఖ అధికారులు పులి పాద ముద్రలను గుర్తిస్తున్నారు. కొయ్యురు అటవీ ప్రాంతాలలో సీసీ కెమెరాలను సైతం అమర్చారు.నిన్న రాత్రి పులి కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో ఆవుదూడను చంపినట్లు గుర్తించారు.

Shilpa

Shilpa

Next Story