పులి రాకను గమనించి ఆగిన ట్రాఫిక్

Tiger: దర్జాగా రోడ్డు దాటి వెళ్లిపోయిన పులి

Sriveni Erugu
Published on: 24 July 2022 10:06 AM IST
Tiger In Traffic
X

పులి రాకను గమనించి ఆగిన ట్రాఫిక్

Tiger: చూడ‌టానికి అదో జాతీయ ర‌హ‌దారిలాగే క‌నిపిస్తోంది. డ‌బుల్ లేన్‌తో ఉన్న ఆ రోడ్డు ఓ ద‌ట్టమైన అట‌వీ ప్రాంతం మీదుగా వెళుతోంది. ట్రాఫిక్ మామూలుగానే క‌దులుతున్నా ఉన్నట్టుండి రెండు వైపులా వాహ‌నాలు ఆగిపోయాయి. మ‌ధ్యలో 150 నుంచి 250 మీట‌ర్ల దూరంలో ఎలాంటి వాహ‌నాలు లేవు. అంత దూరాన అటు వైపు నుంచి వాహ‌నాలు ఆగితే ఇటువైపున వాహ‌నాల‌ను నిలిపివేశారు. అటువైపుగా ఓ టైగర్ వస్తోందట. పులి వ‌స్తున్న విష‌యాన్ని ఎలా గ్రహించారో తెలియ‌దు గానీ ఆ రోడ్డు వెంట వెళ్లే వాహ‌నదారులు ఎక్కడిక‌క్కడే ఆగిపోయారు. వాహ‌నాల‌న్నీ ఆగిపోయాక‌ చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ పులి రోడ్డు దాటిపోయింది. ఈ దృశ్యం ఎక్కడిదో గానీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్‌కు చెందిన అధికారి ఈ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story