కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం : యువకుడిని అడవిలోకి లాక్కెళ్లిన..

Arun Chilukuri
Updated on: 11 Nov 2020 5:45 PM IST
కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం : యువకుడిని అడవిలోకి లాక్కెళ్లిన..
X

కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపింది. దహేగాం మండలం రాంపూర్ అటవీప్రాంతంలో ఓ పెద్దపులి దాడి చేయటంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యువకుడిని చంపిన పులి.. మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లింది. అటవీ, పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పెద్దపులి దాడితో ఒక్కసారిగా రాంపూర్ గ్రామం ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో వణుకుతున్నారు గ్రామస్తులు. అటవీ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని వాపోతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story