Top
logo

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం : ఆవుదూడపై పెద్దపులి దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం : ఆవుదూడపై పెద్దపులి దాడి
X
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి అటవీప్రాంతంలో ...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్టు గుర్తించారు స్థానికులు. తెల్లవారుజామున ఓ ఆవుపై పెద్దపులి దాడి చేసినట్టు చెబుతున్నారు. రాత్రి కాపలాకు వెళ్లిన రైతులు కేకలు వేయడంతో పులి అక్కడినుంచి పరారైనట్టు వెల్లడించారు. పెద్దపులి సంచారంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

మరోవైపు ఈ మధ్య కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పులుల సంచారం తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా పులులు అడవులను వదిలి ప్రజావాసాల్లోకి రావడం పెద్ద సవాల్‌గా మారుతోంది. జంతువులపైనే కాకుండా మనషులపై కూడా ఈ పులులు దాడులు చేస్తున్నాయి. గత ఏడాది కాలంగా పులుల దాడుల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది గాయాలతో బయటపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా పులుల సంచారంపై అటవీశాఖ అప్రమత్తమైంది. పులి సంచారమన్న సమాచారం రాగానే ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తోంది. పాద ముద్రలు, ఆనవాళ్లు పరిశీలించి వాటి కదలికపై ట్రాక్‌ కెమెరాలతో నిఘా పెడుతున్నారు సిబ్బంది. పులి సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించి బోన్లను ఏర్పాటు చేస్తున్నారు.

Web Titletiger attack on cow-calf in baradari Kothagudem district
Next Story