వేములవాడ, జగిత్యాల ఎమ్మెల్యేలకు మొదలైన టికెట్‌ టెన్షన్

Ticket Tension Started For Vemulawada And Jagityal MLAs
x

వేములవాడ, జగిత్యాల ఎమ్మెల్యేలకు మొదలైన టికెట్‌ టెన్షన్

Highlights

Karimnagar: రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు రెబల్స్‌ టెన్షన్‌

Karimnagar: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్ఎస్‌లో టికెట్లపై ఉత్కంఠ కొనసాగుతుంది. వేములవాడ, జగిత్యాల ఎమ్మెల్యేలకు టికెట్‌ టెన్షన్‌ మొదలైంది. ఎమ్మెల్యే రమేష్‌బాబు ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. మరోవైపు వేములవాడ టికెట్‌ ఆశిస్తున్న చల్మెడ లక్ష్మీనరసింహరావు నియోజకవర్గంలోని బీఆర్ఎస్‌ నేతలతో వరుసగా రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జగిత్యాలలో పోటీ చేస్తానో లేదో.. చేస్తే ప్రజలు నాకే ఓట్లు వేస్తారని సంజయ్‌కుమార్‌ వ్యాఖ్యలు చేయడంతో ఆసక్తి నెలకొంది.

మానకొండూర్‌లో టికెట్‌ ఆశిస్తున్న ఆరెపల్లి మోహన్‌కు ఎస్సీ కార్పొరేషన్‌ పదవి హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు ప్రచారం జరుగుతుంది. చొప్పదండిలోనూ ఆశావహులకు అధిష్ఠానం సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. రామగుండం ఎమ్మెల్యే చందర్‌కు రెబల్స్‌ టెన్షన్‌ నెలకొంది. అధిష్టానం చర్చలతో ఆశావహులు మౌనంగా ఉన్న టికెట్‌ వచ్చే వరకు ఉత్కంఠ ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories