మాజీమంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఏ క్షణమైనా..

Thummala Nageswara Rao: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 3 Aug 2022 4:54 PM IST
Thummala Nageswara Rao Key Comments About Elections
X

మాజీమంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు.. ఏ క్షణమైనా..

Thummala Nageswara Rao: మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. మంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ధిపైనే దృష్టి పెట్టానన్నతుమ్మల కార్యకర్తలను పూర్తిస్థాయిలో కలవలేకపోయానన్నారు. కానీ ఇప్పుడు పూర్తి సమయం కేటాయిస్తానని చెప్పారు తుమ్మల. గత ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం తిరిగానని, ఇప్పుడు మాత్రం తన దృష్టి అంతా పాలేరుపైనేనంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు తనను ఆశీర్వదిస్తే మిగిలిన పనులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story