ఖమ్మంలో నాగేశ్వర్‌రావుకు ఘన స్వాగతం.. వెయ్యికార్లు.. 2వేల బైక్‌‌లతో భారీ ర్యాలీ

Khammam: కాసేపట్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న తుమ్మల

Shekhar G
Published on: 25 Aug 2023 3:47 PM IST
Thummala Nageswara Rao Held A Huge Rally In Khammam
X

ఖమ్మంలో నాగేశ్వర్‌రావుకు ఘన స్వాగతం.. వెయ్యికార్లు.. 2వేల బైక్‌‌లతో భారీ ర్యాలీ

Khammam: ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌ గూడెం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సరిహద్దు నుండి సుమారు వెయ్యి కార్లు, 2వేల బైక్‌లతో భారీ ర్యాలీగా ఖమ్మం బయలుదేరారు. బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీ ఎన్నికలకు 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. అందులో తుమ్మల నాగేశ్వరరావు పేరు లేకపోవడంతో తుమ్మల అనుచరుల భగ్గుమన్నారు. పార్టీ మారాలని జిల్లా వ్యాప్తంగా తుమ్మల అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. తుమ్మలను ఎట్టి పరిస్థితుల్లోనే పాలేరు నుండి పోటీ చేయించాలని అనుచరులలు భావిస్తున్నారు. అయితే తుమ్మల ఈరోజు తన భవిష‌్యత్ కార్యాచరణను కాసేపట్లో ప్రకటించనున్నారని తెలిసింది.

Shekhar G

Shekhar G

Next Story