శంషాబాద్ లో దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి చంపిన దుండగులు

Shamshabad: సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు

Shekhar G
Published on: 11 Aug 2023 8:09 AM IST
Thugs Killed The Woman By Pouring Petrol On Her In Shamshabad
X

శంషాబాద్ లో దారుణం.. మహిళపై పెట్రోల్‌ పోసి చంపిన దుండగులు

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిసరాల్లో దారుణం చోటుచేసుకుంది. శ్రీనివాస్ నగర్ కాలనీలో గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేశారు దుండగులు. అపార్ట్ మెంట్ పరిసరాల్లో ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు, క్లూస్ టీమ్ సంఘటన స్థలం చేరుకుని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో బైక్‌‌ మీద ఓ వ్యక్తి వచ్చి పోయినట్లుగా సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Shekhar G

Shekhar G

Next Story