ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య
x
Highlights

* కుమ్రంభీం జిల్లా భూరేపల్లి గ్రామంలో విషాదం * కుటుంబకలహాలే సూసైడ్‌కు కారణం * ప్రాణహిత నదిలో దూకి తల్లి, కూతురు ఆత్మహత్య * భార్య,కూతురు మృతి తట్టుకోలేక నక్క రాజు సూసైడ్

కుమ్రంభీం జిల్లా చింతలమానపల్లి మండలం భూరేపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆ గ్రామంలో విషాదం చాయలు అలుముకున్నాయి. భూరేపల్లి గ్రామానికి చెందిన నక్కరాజుకు తన భార్యతో గొడవ పడ్డాడు. దాంతో కూతురిని వెంట పెట్టుకుని మహారాష్ట్రలోని తమ పుట్టింటికి వెళ్తానని చెప్పి వెళ్లింది. మార్గ మధ్యలోనే ప్రాణహిత నదిలో దూకి తల్లి కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, కూతురు మరణాన్ని తట్టుకోలేక నక్కరాజు కూడా ఇంటి సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

గత కొంత కాలంగా చిన్న చిన్న గొడవలు ఉండేవి. అయితే. ఉంటున్నభార్యభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు ఉండాలి కానీ, అనుమానం ఉండకూడదు.. అది వారినే కాకుండా వారి కుటుంబాన్ని కూడా విచ్చిన్నం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories