తిమ్మాపూర్ వాగులో కారు గల్లంతు.. నవ వధువు సహా ఇద్దరి మృతదేహాలు లభ్యం

Car Missing Case: నవవధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్వేత, బాలుడి మృతదేహాలు లభ్యం

Sandeep Eggoju
Published on: 30 Aug 2021 11:05 AM IST
Three Dead Bodies Founded in Thimmapur Car Missing Case
X

నవ వధువు సహా మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం (ఫైల్ ఇమేజ్)

Car Missing Case: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభ్యమైంది. కారులో ఆరుగురు ప్రయాణిస్తుండగా.. నవ వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క క్షేమంగా బయటపడ్డారు. ఇక నేడు నవ వధువు ప్రవల్లిక, వరుడి సోదరి శ్వేతా, ఎనిమిది సంవత్సరాల ఇషాంత్ రెడ్డి మృతదేహాలను వెలికితీశారు. డ్రైవర్ రాఘవేందర్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నెల 26న రావులపల్లికి చెందిన నవాజ్‌రెడ్డికి మోమిన్ పేటకు చెందిన ప్రవల్లికతో వివాహం జరిగింది. మోమిన్‌పేటకు వెళ్లి వస్తుండగా తిమ్మాపూర్ వాగులో కారు కొట్టుకుపోయింది. రోడ్డుపై నీరు పారుతుండగా వద్దని వారించినా వినకుండా వాగుదాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story