Shadnagar: విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 26 Sept 2022 11:47 AM IST
Three Children Drown in Water Tank at Shadnagar
X

Shadnagar: విషాదం.. నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారుల మృతి

Shadnagar: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని ఓ వెంచర్ నీటిగుంతలో పడి పదేళ్ల వయసున్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించడంతో ఆడుకుంటూ నీటిగుంట వరకు వెళ్లారు. అక్కడ చేప పిల్లలు కన్పించడంతో వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించి దురదృష్టవశాత్తూ నీటి గుంతలోనే మునిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ముగ్గురు చిన్నారుల మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తమ కొడుకులు ఇక లేరన్న వార్త విన్న తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరంకాలేదు. మృతుల్లో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కాగా మరొక చిన్నారి మరో కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story