Coronavirus: రోజురోజుకూ కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి

Coronavirus: తెలంగాణలో ఒక్కరోజులోనే 1,321 కొత్త కేసులు

Sandeep Eggoju
Updated on: 5 April 2021 11:57 AM IST
Thousands Of Corona Cases Founded in Telangana
X

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తోంది. తెలంగాణలో ఒక్కరోజులోనే 1,321 కొత్త కేసులు నమోదవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తంగా బాధితుల సంఖ్య 3లక్షల 12వేల 140కి పెరిగింది. తాజాగా మరో ఐదుగురు మహమ్మారికి బలయ్యారు. ఇప్పటి వరకూ 1,717 మంది మృత్యువాత పడ్డారు. శనివారం 62వేల 973 నమూనాలను పరీక్షించగా, పాజిటివ్‌ రేటు 2.09 శాతానికి పెరిగింది. మొత్తం పరీక్షల సంఖ్య ఒక కోటి, 3 లక్షల, 92వేల, 927కు పెరిగింది. తాజాగా 293 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 320 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లోనూ క్రమేణా మహమ్మారి విస్తరిస్తోంది. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 144, రంగారెడ్డి 121, నిర్మల్‌ 64, సంగారెడ్డి 49, జగిత్యాల 46, వరంగల్‌ నగరం 43, కరీంనగర్‌ 41, రాజన్న సిరిసిల్ల 35, ఆదిలాబాద్‌ 30, మహబూబ్‌నగర్‌ 30, నల్గొండ 28, మంచిర్యాల 24, ఖమ్మం 23, సిద్దిపేట 23, యాదాద్రి భువనగిరిలో 21 చొప్పున కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story