Third Front: డీఎంకేతో టీఆర్ఎస్‌కు దోస్తీ అంత ఈజీ కాదా.. కేసీఆర్‌కు ఓన్లీ ఛాయిస్ థర్డ్‌ ఫ్రంటేనా?

Third Front: Telangana CM KCR Meets Tamil Nadu CM MK Stalin
x

Third Front: డీఎంకేతో టీఆర్ఎస్‌కు దోస్తీ అంత ఈజీ కాదా.. కేసీఆర్‌కు ఓన్లీ ఛాయిస్ థర్డ్‌ ఫ్రంటేనా?

Highlights

Third Front: దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయా? అందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా?

Third Front: దక్షిణ భారతంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతాయా? అందుకు సీఎం కేసీఆర్ చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇందుకే తమిళనాడు సీఎం స్టాలిన్‌ను కేసీఆర్ కలిశారా? వారివురి నడుమ ఇదే చర్చ జరిగిందా? మరి యూపీఏ వాకిట్లో వున్న స్టాలిన్‌, కేసీఆర్ పిలుపుతో పక్క చూపులు చూస్తారా? సౌత్‌ సెంటిమెంట్‌‌తో చేతులు కలుపుతారా? ఒకవైపు మమత మూడో కూటమి సన్నాహాల్లో తలమునకలైన టైంలో, కేసీఆర్‌ ప్రయత్నాల సంకేతాలేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సమావేశం కావడం, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకవైపు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, థర్డ్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్న సమయంలో, కేసీఆర్, స్టాలిన్ మీటింగ్‌ అత్యంత ఆసక్తిగా మారింది.

తమిళనాడులో పర్యటించిన కేసీఆర్, కుటుంబసమేతంగా శ్రీరంగంలో ఆలయాన్ని సందర్శించారు. తర్వాత చెన్నై వెళ్లి, సీఎం స్టాలిన్‌‌ను మీట్‌ అయ్యారు. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌తో పాటు పలువురు కేసీఆర్‌ వెంట వున్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యాక, తొలిసారి కలిశారు తెలంగాణ ముఖ్యమంత్రి. గతంలో స్టాలిన్‌ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడు కూడా, కేసీఆర్‌ చెన్నై వెళ్లి కలిశారు. మరి ఇప్పుడెందుకు మీట్‌ అయ్యారు? మూడో ఫ్రంట్‌ ముచ్చట కోసమేనా? లేదంటే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే ప్రయత్నమా?

డీఎంకే ప్రస్తుతానికి యూపీఏ భాగస్వామి. బీజేపీకి బద్దవ్యతిరేకి. ఇందుకే, బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్‌ కోసం ప్రయత్నిస్తున్న మమతా బెనర్జీ, డీఎంకేను మాత్రం టచ్‌ చెయ్యలేదు. అసలు దక్షిణాది వైపు చూడనే లేదు దీదీ. ఉత్తరాదిలో శివసేన, ఎన్సీపీలను ఫ్రంట్‌వైపు నడిపించాలనుకున్నారు. ఇదే సమయంలో, కేసీఆర్ సైతం ఎప్పటి నుంచో మూడో ప్రత్యామ్నాయం కోసం మంత్రాంగం చేస్తున్నారు. గతంలో మమతను కూడా కలిశారు కానీ, ప్రయత్నం ముందుకెళ్లలేదు. ఇఫ్పడు బీజేపీని ఏకిపారేస్తున్న కేసీఆర్, జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అయితే, యూపీఏ భాగస్వామి అయిన స్టాలిన్‌ను ఎందుకు కలిశారన్నది ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్‌తో దోస్తీ వద్దని స్టాలిన్‌‌కు నచ్చజెప్పారా? దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరముందని బ్రెయిన్ వాష్ చేశారా? అన్న అంశాలపై రకరకాల చర్చ జరుగుతోంది.

దక్షిణభారతంలో మొత్తం ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళ. అలాగే లక్షద్వీప్, పుదుచ్చేరి అనే రెండు యూటీలున్నాయి. ఏపీలో 25 లోక్‌స‌భ స్థానాలుంటే, 11 రాజ్యసభ సీట్లున్నాయి. కర్ణాటకలో 28 లోక్‌సభ, 12 రాజ్యసభ. కేరళలో 20 లోక్‌సభ, తొమ్మిది రాజ్యసభ. తెలంగాణలో 17 లోక్‌సభ, ఏడు రాజ్యసభ. పుదుచ్చేరి, లక్షద్వీప్‌‌లలో చెరో ఒక లోక్‌సభ స్థానాలున్నాయి. అత్యధికంగా సౌత్‌లో 39 లోక్‌సభ, 18 రాజ్యసభ స్థానాలున్న రాష్ట్రం తమిళనాడు. మొత్తం సౌతిండియన్ రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు 132 కాగా, రాజ్యసభ 58.

132 లోక్‌సభ సీట్లంటే పెద్ద నెంబరే. ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే నెంబర్. అయితే, ఏపీ, తమిళనాడులో మాత్రమే జాతీయ పార్టీలకు బలం లేదు. మిగతా కర్ణాటక, కేరళ, తెలంగాణలో జాతీయ పార్టీలే ప్రధానపక్షాలుగా వున్నాయి. కర్ణాటకలో జేడీఎస్‌ కూడా ప్రాంతీయ పక్షమే. దీంతో దక్షిణాదిలో అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకుపోవాలన్నా అనేక ఇబ్బందులు. పక్కనే వున్న ఒడిషాలోనూ రీజనల్ పార్టీనే అధికారంలో వుంది. ఇలా టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ, డీఎంకే, జేడీఎస్‌లను ఒక కూటమిగా ఏర్పాటు చేసేందుకు, కేసీఆర్‌ ఏమన్నా చొరవ తీసుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రత్యర్థులు కాంగ్రెస్, బీజేపీ. కానీ తమిళనాడులో డీఎంకేకు బీజేపీ ప్రత్యర్థికాదు. కాంగ్రెస్‌ మిత్రపక్షం. మరి డీఎంకేతో టీఆర్ఎస్‌కు దోస్తీ ఎలా కుదురుతుందన్నది మరో ప్రశ్న. అలాగే, మమత ఫ్రంట్‌లో కేసీఆర్‌ చేరతారనుకున్నా, స్టాలిన్‌‌ మాత్రం అంత ఈజీగా ఒఫ్పుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే, ఆయనిప్పుడు యూపీఏలో వున్నారు. వస్తేగిస్తే కేసీఆరే కాంగ్రెస్ కూటమిలోకి రావాలి గానీ, స్టాలిన్‌ మాత్రం బయటపడే ఛాన్స్ కనపడ్డంలేదన్నది విశ్లేషకుల మాట. కానీ రాష్ట్రంలో ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ కూటమిలో చేరేందుకు, కేసీఆర్ ఇష్టపడరు. ఒక్క దక్షిణాది సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే తప్ప, స్టాలిన్, కేసీఆర్‌ ఒకే ఫ్రంట్‌ పంచుకోవడం అంత ఈజీకాదని అర్థమవుతోంది.

మొత్తానికి రెండు జాతీయ పార్టీలు ప్రత్యర్థులుగా వుండటంతో, కేసీఆర్‌కు వన్‌ అండ్‌ ఓన్లీ ఛాయిస్ థర్డ్ ఫ్రంట్‌ మాత్రమే. కానీ మొండిపట్టుదల పట్టే మమత జట్టులో చేరేందుకు, కేసీఆర్‌ ఇష్టపడతారా? లేదంటే ఎన్నికల తర్వాత సమీకరణలను బట్టి అడుగులేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories