మరోసారి రెచ్చిపోయిన సంక్రాంతి దొంగలు..

మరోసారి రెచ్చిపోయిన సంక్రాంతి దొంగలు..
x
Highlights

తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ చేసుకొని సంక్రాతి దొంగలు హల్ చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులు, తాళాలు పగులగొట్టి దొరికినకాడికి దోచుకెళ్లారు

తాళాలు వేసిన ఇళ్ళను టార్గెట్ చేసుకొని సంక్రాతి దొంగలు హల్ చేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తలుపులు, తాళాలు పగులగొట్టి దొరికినకాడికి దోచుకెళ్లారు. బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా డబ్బు,ఎలక్ట్రానిక్ పరికరాలను సైతం వదలకుండా చేతివాటం ప్రదర్శించారు. నాలుగు ప్రాంతాల్లో 13 చోట్ల చోరీలు చేయడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

భాగ్యనగరంలో అందరు అనుకున్నట్లే మరోసారి సంక్రాంతి దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేసుకుని దోచిన కాడికి దోచుకుపోయారు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా, పుర జనులు ఇవేవి పట్టించుకోక దొంగలబారిన పడి భోరుమంటున్నారు.. మీర్‌పేట్‌, అల్వాల్ , జీడిమెట్ల ,సనత్ నగర్ పియస్ పరిధిలో పండగకు‌ ఊరెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇల్లు‌ గుళ్ల చేసారు. తాళాలు పగల గొట్టి బంగారు , నగదు అభరణాలను ఎత్తుకెళ్ళారు...

మీర్‌పేట్, అల్వాల్, జీడిమెట్ల, సనత్ నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో 13 చోట్ల చోరీలు చేశారు .. మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రం గూడ , జిల్లెల గూడ పలు కాలనిలో వరుస గా 7 ఇండ్లలో చోరి జరిగింది. కనీసం ఏడూ నుండి 10 లక్షలు వరకు సొమ్ము ఎత్తుకెళ్ళినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ..

జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లోని సంతోష్ రెడ్డి ఇంట్లో చోరి జరిగింది. ఇంటి యజమాని సంక్రాంతి పండుగకు ఊరికివెళ్లారు. ఇదే అదనుగా ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్‌రూమ్ లోని అల్మారాను తెరిచి లోపలున్న 19 తులాల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు.. ఇంటి యజమాని సంతోష రెడ్డి ఊరి నుండి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండడంతో చోరి జరిగిందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు..బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇక అల్వాల్ లోని లోతు కుంటలో వరుసగా నాలుగు ఇళ్ళలో చోరీలు జరిగాయి .. 20 తులాలు బంగారం, 3 లక్షలు నగదు ఎత్తుకెల్లారు దొంగలు .. ఇంకా రెండు ఇళ్ళలో ఇంటి యజమానులు రాకపోవడంతో ఎంత మొత్తం లో నగదు బంగారు పోయింది అనేది క్లారిటీ లేదు.

పండుగకు ఊరికి వెళ్లేవారు ఇంటి దగ్గర జాగ్రత్తలు తీసుకొని పోలీసులకు సమాచారం ఇవ్వండి అని మొత్తుకున్న కూడా వినకపోవడం తో ఇలా చోరీలు జరిగాయని , మరికొన్ని ప్రదేశాల్లో పోలీసులకి సమాచారం ఇచ్చినా కూడా చోరీలు జరిగాయని భాదితులు లబోదిబోమంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories