పాతబస్తీలో అర్థరాత్రి రెండు ఏటీఎంలలోకి చొరబడ్డ దొంగలు.. మోగిన అలారం...

Thieves Broke into Two ATMs in The Old Town at Midnight in Hyderabad | Live News
x

పాతబస్తీలో అర్థరాత్రి రెండు ఏటీఎంలలోకి చొరబడ్డ దొంగలు.. మోగిన అలారం...

Highlights

Hyderabad: *మాదన్నపేట పీఎస్ పరిధిలో అర్థరాత్రి దొంగల బీభత్సం *ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో అర్థరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. మధన్నపేట్ పీఎస్ పరిధిలో అర్దరాత్రి ఎస్‌బీఐ బ్యాంక్ ఏటీఎంతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో చోరికి విఫలయత్నం చేశారు దొంగలు. రెండు ఏటీఎంలలోకి ప్రవేశించిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం మిషన్లను బ్రేక్ చేశారు. వెంటనే సెక్యూరిటీ అలారం మోగగనే అక్కడి నుండి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. దొంగలు లోపలికి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories