ఆదిలాబాద్‌ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు

* కలెక్టర్‌ చౌక్‌లోని SBI ఏటీఎంను ఎత్తుకెళ్లిన దుండగులు * ఏటీఎంలో దాదాపు రూ.30 లక్షల నగదు ఉన్నట్టు అంచనా * టూ టౌన్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు 200 మీటర్ల దూరంలో ఏటీఎం

Sandeep Eggoju
Updated on: 5 Feb 2021 10:18 AM IST
Thieves are stole the ATM in Adilabad district
X

Representational Image

ఆదిలాబాద్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలోని నగదును కాదు ఏకంగా ఏటీఎం మిషన్‌నే ఎత్తుకెళ్లారు దుండగులు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ చౌక్‌లో ఉన్న SBI ఏటీఎం చోరీకి గురైంది. టూ టౌన్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు 200 మీటర్ల దూరంలో ఉన్న SBI ఏటీఎంను ఎత్తుకెళ్లారు దొంగలు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఏటీఎంలో దాదాపు 30 లక్షల నగదు ఉన్నట్టు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. అయితే దొంగలు పారిపోతూ దేవిచంద్‌ చౌక్‌లోని మరో ఏటీఎం, ఓ జ్యూవెలరీ షాప్‌లోని ఏటీఎంలలోను చోరీకి విఫలయత్నం చేశారు. జిల్లాలో వరుస ఏటీఎంల చోరీ ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story