హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. దొంగతనం.. ఆపై ఇంటికి నిప్పు..

Hyderabad: హైదరాబాద్ శివారు పాత అల్వాల్ రోడ్డు పంచశీల సమీపంలోని రెసిడెన్సీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు.

Arun Chilukuri
Published on: 27 Aug 2022 1:20 PM IST
Thiefs Crest Ruckus in Hyderabad and set Fire on House
X

హైదరాబాద్‌లో దొంగల బీభత్సం.. దొంగతనం.. ఆపై ఇంటికి నిప్పు..

Hyderabad: హైదరాబాద్ శివారు పాత అల్వాల్ రోడ్డు పంచశీల సమీపంలోని రెసిడెన్సీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారు రెడ్డి ఇంట్లో చొరబడిన దుండగులు, 80 వేల నగదును దోచుకెళ్లారు. దొంగతనం చేసిన ఆనవాళ్లు కన్పించకుండా ఇంటికి నిప్పు పెట్టారు. దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఇంటికి నిప్పంటించడంతో రెండో అంతస్తులో ఉన్న సామగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story