Attempt to Steal Temple Hundi: హైదరాబాద్‌లో చెన్నకేశవ ఆలయం హుండీ చోరీకి యత్నం..

Attempt to Steal Temple Hundi: చారిత్రక ఆలయమైన చెన్నకేశవ సన్నిదిలో మంగళవారం రాత్రి హుండి చోరీ చేసిందుకు దుండగులు ప్రయత్నించారు.

S. Srikanth
Published on: 26 Aug 2020 1:33 PM IST
Attempt to Steal Temple Hundi: హైదరాబాద్‌లో చెన్నకేశవ ఆలయం హుండీ చోరీకి యత్నం..
X

Attempt to Steal Temple Hundi

Attempt to Steal Temple Hundi: చారిత్రక ఆలయమైన చెన్నకేశవ సన్నిదిలో మంగళవారం రాత్రి హుండి చోరీ చేసిందుకు దుండగులు ప్రయత్నించారు. బుధవారం ఉదయం ఆలయ పూజారి హుండి పగిలిపోవడాన్ని గమనించి ఆలయ నిర్వహణ కమిటీకి సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. హుండినిపగలగొట్టడానికి దొంగలు ఇనుప రాడ్లను ఉపయోగించారని.. ఆలయం నుండి ఏదైనా నగదు లేదా ఇతర వస్తువులు దొంగిలించబడిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

భక్తుల నుండి వచ్చిన స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించడానికి ఆగస్టు 27 న ఎండోమెంట్ విభాగం అధికారులు హుండిని తెరిచినట్లు ప్రకటించిన తరువాత ఈ సంఘటన జరిగింది. క్లూస్ టీమ్‌తో పాటు సంఘటన స్థలానికి చేరుకున్న చంద్రయంగుట్ట పోలీసులకు కమిటీ సమాచారం ఇచ్చింది. ఏదైనా దొంగతనం జరిగిందో లేదో తనిఖీ చేయడానికి వచ్చే ఎండోమెంట్ విభాగం అధికారులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదేవిదంగా ఆలయ ప్రాంగణంలోని సిసిటివి ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించనున్నట్లు సమాచారం.

S. Srikanth

S. Srikanth

Next Story